ద్విత్వా తుఫాన్ కారణంగా కురిసిన వర్షానికి ధాన్యం తడవకుండా, రంగు మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గొల్లప్రోలు మండల వ్యవసాయాధికారి కెవివి సత్యనారాయణ సూచించారు. తడిసిన ధాన్యం, వరి పనలపై ఐదు శాతం ఉప్పు ద్రావణం (ఒక లీటర్ నీటికి 50 గ్రాములు కల్లుప్పు) పిచికారి చేయాలని తెలిపారు. కోతకోసి కుప్పలపై ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రక్షించుకోవాలని, నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలుకాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తకుండా, రంగు మారకుండా ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలపాలని సూచించారు.