రెండు రోజుల్లో కుమార్తె పెళ్లి.. తండ్రి అనుమానాస్పద మృతి..

పిఠాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మరో రెండు రోజుల్లో కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా, తండ్రి కావాటి చిన్న ఏసు (45) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఉప్పాడ బస్టాండ్ సమీపంలోని డ్రెయినేజీలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మద్యం సేవించి కాలువలో పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మే 8న రెండో కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్