పిఠాపురం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీ. వెంకటాపురంలోని డా. బీ. ఆర్. అంబేద్కర్ గురుకులం బాలికల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. చికెన్ పాక్స్ వ్యాధి నిరోధక, కండ్లకలక నివారణకు హోమియోపతి మందులు అందించారు. డాక్టర్ మహేశ్వరి మాట్లాడుతూ, చికెన్ పాక్స్ వ్యాధి లక్షణాలు, దాని నివారణ గురించి విద్యార్థులకు వివరించారు.