ఏరువాక పౌర్ణమి సందర్భంగా పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సోమవారం సస్యవృద్ధి బీజారోపణ మహోత్సవం జరిగింది. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వయంగా నాగలి పట్టి పొలం దున్ని, ప్రతి రైతు వ్యవసాయ శాస్త్రవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎదగాలని, సేంద్రియ వ్యవసాయం ద్వారా భూసారాన్ని కాపాడుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సాధించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆధ్యాత్మిక వ్యవసాయ పురస్కారాలు అందజేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ఆధునిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.