నారా లోకేష్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పిఠాపురంలో టీడీపీ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రతి శుక్రవారం 'కార్యకర్తే అధినేత' గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే క్యాడర్ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు వర్మ మంత్రి లోకేష్‌కు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్