భక్తిశ్రద్ధలతో పాదాంబిక అమ్మవారి చతుర్థ వార్షికోత్సవ వేడుకలు

గొల్లప్రోలు పట్టణంలోని పాదాంబిక అమ్మవారి ఆలయంలో ఆదివారం చతుర్థ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు, మహామంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ చైర్మన్ మొగలి అయ్యారావు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్