గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థిని తోట పుష్పాంజలి 'సకురా సైన్స్ ప్రోగ్రాం 2025'లో భాగంగా జపాన్ పర్యటనకు ఎంపికైంది. ఈ మేరకు ఆమె ఆగస్టు 17 నుంచి జపాన్ పర్యటించనున్నట్టు ప్రధానోపాధ్యాయుడు సూర్యప్రకాశ్ శనివారం తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఆమె జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించినట్లు వివరించారు. జపాన్ లో విద్యా, సాంకేతికతపై అధ్యయనం చేయనున్నట్లు వివరించారు.