గొల్లప్రోలు: విష రసాయనం తాగి బలవన్మరణం

గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఈబీసీ కాలనీకి చెందిన మాకిరెడ్డి పాండవులు(47) పేల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. జూలై 10న రాత్రి పేల మందును మద్యంలో కలుపుకొని తాగాడు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు నాగబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

సంబంధిత పోస్ట్