గొల్లప్రోలు మండలంలో విద్యుత్తు లైన్ల ఏర్పాటు పనులు నిర్వహిస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. దాంతో గొల్లప్రోలు మండలం పరిధిలోని దుర్గాడలో వ్యవసాయ సర్వీసులకు, ఎ. విజయనగరంలో గృహలకు మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.