ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం(పాదగయ) వారి హుండీ లెక్కింపు కార్యక్రమం కాకినాడ జిల్లా తనిఖీదారు వడ్డీ ఫణీంద్ర కుమార్ మరియు కార్యనిర్వహణాధికారులు కర్రి సోమరాజు, వరిపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ సహాయ కమీషనరు, కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఏసీ అండ్ ఈవో మాట్లాడుతూ ది. 31. 03. 2026 నుండి ది. 30. 06. 2026 వరకు 92 రోజులకుగాను ఆలయ హుండీల ద్వారా 19, 29, 139/- రూపాయిలు మరియు అన్నదానం హుండీ ద్వారా 1, 11, 767/- వెరసి రూ. 20, 40, 906/-లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, అర్చకులు, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.