గొల్లప్రోలు మండలంలో గురువారం ఉదయం టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు టాటా ఏస్ వాహనంలో సుమారు 100 కిలోల అక్రమ గోమాంసాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, మాంసం సరఫరా వ్యవహారంపై వివరాలు వెల్లడించాడు. ఈ ఘటనపై డ్రైవర్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వీర్యం చేశారు.