పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో జనసేన నాయకులు శనివారం ఎస్‌ఐ మణికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అవమానకర వీడియోలు, వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ఎక్స్ ఖాతా ద్వారా అభ్యంతరకర కంటెంట్ ప్రచారం చేసి పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు.