పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లపై జేసీ సమీక్ష

పిఠాపురంలో జనవరి 9 నుంచి 11 వరకు వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. శుక్రవారం డీఆర్ఓ వెంకటరావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించి, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టి జిల్లా పర్యాటకాభివృద్ధికి దోహదం చేయాలని సూచించారు. సభావేదికలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, ఆర్డీవో ఎస్ మల్లి బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్