గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా జ్యోతుల శ్రీనివాస్ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి తాటిపర్తికి చెందిన వల్లిపై 200 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను మెచ్చి జనసేనలో చేరిన శ్రీనివాస్, దుర్గాడ గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. పార్టీ బలోపేతం కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని శ్రీనివాస్ తెలిపారు.