హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సోమవారం గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాసు పరామర్శించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు ఆయన నివాసంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ నాదెండ్ల భాస్కరరావు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.