గ్రహణ సమయంలో పూజలు ఆగని ఆలయంపై లోకల్ యాప్ స్పెషల్ స్టోరీ

పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో ఉన్న ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందని పండితులు తెలిపారు. ఈ దేవస్థానంలో ఉప ఆలయాలు కూడా యథావిధిగా దర్శనార్థులకు అందుబాటులో ఉంటాయని, రాష్ట్రంలో శ్రీకాళహస్తి దేవస్థానంతో పాటు పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఈ ఆనవాయితీ కొనసాగుతోందని వివరించారు. గ్రహణం అనంతరం స్వామివారికి పట్టు, విడుపు స్నానాలు, ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తారు. గ్రహణ సమయంలోనూ భక్తులకు అభిషేకాలు నిర్విరామంగా కొనసాగుతాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్