పిఠాపురంలో మైనర్ బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో నిందితుడు జి. సతీష్, విచారణకు పిలవగానే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బుధవారం విచారణకు పిలవగా సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని మొదట పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. గతంలో కూడా అమ్మాయిని వేధించిన కేసులో సతీష్ జైలుకు వెళ్లినట్లు ఎస్ఐ మణికుమార్ తెలిపారు.