పిఠాపురంలో కొత్తగా మంజూరైన 767 పెన్షన్లను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పంపిణీ చేశారు. అర్హులైన వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు అందజేసినట్లు శుక్రవారం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అలాగే కోటి 50 లక్షల రూపాయలతో జగ్గయ్య చెరువును అభివృద్ధి చేస్తున్నామని పార్టీ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ పేర్కొన్నారు.