కొమరగిరి బాలుడి ఆరోగ్యానికి పవన్ భరోసా

యు. కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామానికి చెందిన వెంకట సురేశ్ అనారోగ్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం సురేశ్‌ను మెరుగైన చికిత్స కోసం విశాఖ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో పాడా పీడీ శివరాం ప్రసాద్, జనసేన మండల అధ్యక్షుడు అక్షయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్