పిఠాపురం విద్యార్థుల ప్రతిభకు పవన్ కళ్యాణ్ అభినందనలు

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 47 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థల్లో సీట్లు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ఈ విద్యార్థులు ఉన్నత విద్య వైపు మరో ముందడుగు వేశారు. వారి విజయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ ఫలితాలు పిఠాపురం నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్