సామర్లకోట బ్రిడ్జిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.