ఫీజు బకాయిలు వెంటనే చెల్లించండి: పీడీఎస్యూ

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి సతీశ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై రూపొందించిన కరపత్రాన్ని గురువారం పిఠాపురంలో ఆవిష్కరించారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్