కాకినాడ, పిఠాపురంలో ది పిఠాపురం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీ వీడబ్ల్యూఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శ్రీ సూర్యరాయ గ్రంధాలయంలో శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్నుకోబడిన నూతన సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. గౌరవ అధ్యక్షులుగా బోడపాటి అభి, ప్రెసిడెంట్‌గా జీరెడ్డి వీరబాబు, సెక్రటరీగా కోరంగి గణేష్, వైస్ ప్రెసిడెంట్‌గా ముగడ శివ, జాయింట్ సెక్రటరీగా వాసుపల్లి సురేష్, కోశాధికారిగా మానుకొండ ప్రసాద్ నియమితులయ్యారు.