స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ సీపీఎం పార్టీ నాయకులు శుక్రవారం పిఠాపురంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించింది. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన కరెంటు చార్జీల తగ్గింపు వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని సీపీఎం మండల కన్వీనర్ చిన్నా డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు, ట్రూ-అప్ చార్జీల వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.