ఏలేరు కాలువకు నీరు రాక పిఠాపురం నియోజకవర్గ రైతులు నారుమళ్లు వేయలేకపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. సీపీఐ కాకినాడ జిల్లా మహాసభల జయప్రదం చేయాలని కోరుతూ శనివారం పిఠాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే పిఠాపురానికి వచ్చి రైతుల కష్టాలను చూసి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.