పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు శుక్రవారం పర్యటిస్తారని జనసేనపార్టీ ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఉదయం కాకినాడ నుంచి బయలుదేరి పిఠాపురం చేరుకుంటారన్నారు. జగ్గయ్యచెరువు ప్రాంతంలో నిర్వహించే కార్యక్రమంలో లబ్దిదారులకు పింఛన్లు అందిస్తారన్నారు. అనంతరం కొత్తపల్లి మండలం ఆనందనగర్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మర్రెడ్డి తెలిపారు.