పిఠాపురం: రెండో నెల జీతాన్ని చిన్నారుల సంక్షేమానికి కేటాయించిన పవన్

పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ చిన్నారుల కోసం ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. వరుసగా రెండో నెల కూడా తన జీతాన్ని చిన్నారుల సంక్షేమానికి కేటాయించారు. 46 మంది పిల్లలకు ఒక్కరికీ రూ.5,000 చొప్పున మొత్తం రూ.2.30 లక్షలు పంపిణీ చేశారు. ఈ నగదును ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ స్వయంగా ఇళ్లకు వెళ్లి గురువారం అందజేశారు.

సంబంధిత పోస్ట్