పిఠాపురం: పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ

పిఠాపురంలో జనసేన సేవా సమితి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్లను శనివారం అందజేశారు. మొత్తం 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు పిఠాపురం జనసేన ఇన్చార్జ్ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ కిట్లను పంపిణీ చేశారు. వర్షాకాలంలో కార్మికులు ఇబ్బందులు పడకుండా, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షణ కల్పించేందుకు ఈ కిట్లు అందజేశామని జనసేన సేవాసమితి సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్