పిఠాపురం నియోజకవర్గ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరావు తెలిపారు. సామర్లకోట నుంచి చిత్రాడ, అక్కడ నుంచి గొల్లప్రోలు వరకు రూ.16 లక్షలతో కాలవల్లో పూడిక తీత పనులు మంగళవారం ప్రారంభించినట్లు చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో పూడిక కారణంగా నీరు తక్కువగా రావడంతో ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు.