పిఠాపురం: అభివృద్ధిని చూడలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. శనివారం యు. కొత్తపల్లి మండలం మూలపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ఇంటింటికీ తిరిగారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్