పిఠాపురం తాలూకా ఏపీ ఎన్జీఓ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా బుధవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కొక్క పదవికి ఒక నామినేషన్ రావడంతో నామినేషన్ వేసిన వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ గా శ్రీకృష్ణ, అసోసియేట్ గా ప్రెసిడెంట్ శ్రీనివాసచార్య, సెక్రటరీగా సురేశ్, హైమ, ట్రెజరర్ సాయికుమార్, జాయింట్ సెక్రెటరీగా నూకరాజు, మొహిద్దిన్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.