ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు విశ్వనాథం, జి. వీరబాబు, కె. చిన్న మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, సేవలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, సిబ్బంది నియామకం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని కోరారు. ప్రైవేటీకరణ వల్ల ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పప్పులు, ఎం. సూరిబాబు, ఎం. సత్తిబాబు, గోవిందు, సత్యనారాయణ, గోపాలకృష్ణ, కోనేటి రాజు, బి. అప్పన్నబాబు, డి. నాగేశ్వరరావు, వి. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.