కొమరగిరి చెరువు సమస్య పరిష్కారానికి వినతి

కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామస్థులు శనివారం జనసేన మండల అధ్యక్షుడు రావు అక్షయ్‌ను కలిసి ఊర చెరువు సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. చేపల పెంపకం కోసం చెరువును గ్రామస్థులకే కేటాయించాలని వారు కోరారు. గతంలో చేబ్రోలు సొసైటీ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని రావు అక్షయ్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్