భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్‌గా శీరం శ్రీనును నియమించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించి బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతను అప్పగించారు. ఈ నియామకం పట్ల శీరం శ్రీను హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత శ్రీ రామచంద్రయాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.