పిఠాపురంలో మోటార్ సైకిళ్ల వరుస చోరీలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో వరుస మోటారు సైకిళ్ల చోరీలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో బొజ్జా వారితోట, కుంతీమాధవస్వామి గుడి, రామా థియేటర్ సెంటర్, పాదగయ అర్చక క్వార్టర్స్ వద్ద ఐదు వాహనాలు దొంగిలించబడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నట్లు సమాచారం. మోటారు సైకిళ్ల చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్