గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏప్రిల్ 1న రాష్ట్ర స్థాయి గుర్రం పరుగు పందేలు, ఏప్రిల్ 2న రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ వెల్లడించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం సమీపంలోని అడవి పుంత మార్గంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ పోటీలు జరగనున్నాయి. ఎడ్ల పరుగు పోటీలు సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి.