పిఠాపురం మున్సిపాలిటీలో వార్డ్ విభజనపై టీడీపీ ఆందోళన

పిఠాపురం పురపాలక సంఘంలో 30 వార్డులను 36 వార్డులుగా పునర్విభజించే ప్రక్రియలో పారదర్శకత పాటించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. వార్డ్ విభజనపై తమ అభ్యంతరాలు, సూచనలు అధికారులకు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని వారు ఆరోపించారు. ప్రజలు, రాజకీయ పార్టీలకు వివరాలు తెలియజేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే పై అధికారులను ఆశ్రయించడంతో పాటు న్యాయపరమైన చర్యలు చేపడతామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్