మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అవడంతో టిడిపి శ్రేణుల సంబరాలు

గొల్లప్రోలు పట్టణాన్ని నగర పంచాయతీ నుండి మూడవ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడాన్ని టిడిపి శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకున్నాయి. టిడిపి పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ అప్‌గ్రేడ్‌తో పట్టణంలో మౌలిక వసతులు, శుభ్రత, తాగునీటి సరఫరా వంటి అంశాలు మెరుగుపడి, అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్