గొల్లప్రోలు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్, మాదేపల్లి రంగబాబు విగ్రహాలకు నివాళులర్పించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, ఆ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.