నగర సంకీర్తనలో భక్తుల సందడి: సంస్కృతికి పెరుగుతున్న గౌరవం

కాకినాడ, జగ్గంపేట, పిఠాపురం ప్రాంతాలలో 12వ రోజు కూడా మాఘమాసంలో నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. రోజురోజుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ, 'గోవిందా రామ గోవిందా హరే హరే' నామ సంకీర్తనతో మనసుకి ఉత్సాహాన్ని పొందుతున్నారు. ఈ కార్యక్రమం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలపై గౌరవాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. గొల్లప్రోలులో కూడా ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది.

సంబంధిత పోస్ట్