పన్ను చెల్లింపులకు గడువు దగ్గర పడుతోంది.. రాయితీలు పొందండి..

పిఠాపురం మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు చెల్లించేందుకు గడువు ఏప్రిల్ 30తో ముగియనుంది. కమిషనర్ కనకారావు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం, గడువులోగా బకాయిలు చెల్లిస్తే పాత పన్నులపై 50 శాతం వడ్డీ మాఫీ, ప్రస్తుత పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుంది. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు తర్వాత ఎలాంటి రాయితీలు ఉండవని, ఆలస్య రుసుములు వర్తించే అవకాశం ఉందని హెచ్చరించారు. వెంటనే పన్నులు చెల్లించి ప్రయోజనం పొందాలని కోరారు.

సంబంధిత పోస్ట్