గొల్లప్రోలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్ష ఎన్నిక ఏకపక్షంగా సాగుతున్నట్లు సమాచారం. పట్టణ అధ్యక్ష అభ్యర్థి మామిడాల సూరిబాబుకు మద్దతుగా 20 వార్డుల్లో 18 వార్డుల్లో ఆయన మద్దతుదారులు గెలుపొందారు. మరో అభ్యర్థి నామమాత్రపు పోటీకే పరిమితమయ్యారని, మిగిలిన ఇద్దరూ సూరిబాబుకే మద్దతు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.