పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుర్తాలం పీఠాధిపతి పూజలు

బుధవారం పిఠాపురం పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వరస్వామి దేవస్థానాన్ని కుర్తాలం పీఠాధిపతి శ్రీదత్తేశ్వర ఆనంద భారతీస్వామి సందర్శించారు. ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ స్వామీజీకి స్వాగతం పలికారు. స్వామీజీ కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి, పురుహూతిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ మర్యాదలతో పీఠాధిపతిని గౌరవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్