తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్‌ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తన కుమారుడు గిరీష్ వర్మతో కలిసి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్మ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.