గొల్లప్రోలులో ఆదివారం శ్రీ వాసవి మాత జయంతిని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రథంపై ఆశీనులు చేసి, పురవీధులలో గ్రామోత్సవం చేపట్టారు. గొల్లప్రోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గొల్లప్రోలు మండలానికి చెందిన ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.