రెండు నెలలకు పైగా కాకినాడ, పోలవరం జిల్లాల్లో కలకలం సృష్టించిన పెద్దపులి ఇప్పుడు పోలవరం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ గిరిజన గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. శనివారం జోడుమామిళ్ల, పోతవరం పరిసరాల్లో పులి సంచారాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పులి అటవీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాల వైపు వెళ్లే అవకాశం ఉన్నందున, అప్రమత్తమైన అధికారులు వాహనాలను నిలిపివేశారు.