చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని మూసివేశారు. ఇప్పటికే వచ్చిన భక్తులకు దర్శనాలు చేయించిన అనంతరం ఆలయ ద్వారాలకు తాళాలు వేశారు. గ్రహణ ప్రభావంతో ఆలయం వెలవెలబోయింది. బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం తిరిగి స్వామివారి దర్శనాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు.