ప్రత్తిపాడు బీసీవై పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గొంప శివకుమార్, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల బీసీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఏప్రిల్ 11న బీసీ ధర్మదీక్ష ఆమరణ దీక్షకు మద్దతుగా ఏలేశ్వరంలో బీసీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు, కార్పొరేషన్ ద్వారా నిధులు, కుల గణన, బీసీ రక్షణ చట్టం, విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.