బాధిత కుటుంబానికి జనసేన నేత ఆర్థిక సాయం

శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన గంపల వెంకటేష్ ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి శనివారం పరామర్శించారు. వెంకటేష్ మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సహాయంగా 50 కిలోల బియ్యం, రూ. 3,000 నగదు అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక జనసేన నాయకులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్