కాకినాడ జిల్లా కలెక్టర్ హరింధర్ ప్రసాద్ బుధవారం తన సతీమణితో కలిసి అన్నవరం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాధరావు, ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఈఓ కలెక్టర్‌ను సత్కరించి, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.